కాలం సమయం నాదే అంటు - అనుకుంటున్నావా
రోజులన్నీ నావే అంటు - జీవిస్తున్నావా ... హో...
(repeat)
దేవుని ముందు నిలిచే రోజుందీ...
దేవునికి బదులిచ్చే రోజుందీ...
నీ లెక్క అప్పా చెప్పే రోజుందీ...
నీ తక్కెడ తూకం వేసే రోజుందీ...
ఆగవేమయ్యా... ఈ మాట వినవయ్యా...
నీ గుండె తలుపులు తెరచి యేసుని పిలుచుకో వయ్యా
(repeat)
చూచావా భూకంపాలు , వరదలు విపరీతాలు
పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు
(repeat)
వడివడిగా రోజులు పరిగెడుతున్నాయి (2x)
తరుణాలు చేజారి పోతున్నాయి (2x)
ఆగవేమయ్యా... ఈ మాట వినవయ్యా...
నీ గుండె తలుపులు తెరచి యేసుని పిలుచుకో వయ్యా
(repeat)
జరుగుచున్న రోజులు కావు నీవి కావు
ధారంగా దేవుడు నీకు ఇచ్చినట్టివి
(repeat)
నిన్నటి వరకు కొరతే లేదని అన్నారు (2x)
ఒక్క గడియలో ఎందరెందరో బికారులయ్యారు (2x)
ఆగవేమయ్యా... ఈ మాట వినవయ్యా...
నీ గుండె తలుపులు తెరచి యేసుని పిలుచుకో వయ్యా
(repeat)
కాలం సమయం నాదే అంటు - అనుకుంటున్నావా
రోజులన్నీ నావే అంటు - జీవిస్తున్నావా
(repeat)
Comments
Post a Comment
Hi, please write your comments on this post.